News1st Nov 03:28 PMSunil Byrisetty1 min read

మొంథా తుఫాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారు

మొంథా తుఫాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. కృష్ణా జిల్లా పెడన సమీపంలో పంట పొలాలను పరిశీలించిన ఆమె తుఫాను బీభత్సం సృష్టించిందని, ఎక్కడ చూ

మొంథా తుఫాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారు
మొంథా తుఫాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. కృష్ణా జిల్లా పెడన సమీపంలో పంట పొలాలను పరిశీలించిన ఆమె తుఫాను బీభత్సం సృష్టించిందని, ఎక్కడ చూసినా పంటలు నేలమట్టం అయ్యాయని, అసలే రాష్ట్ర రైతులు అప్పుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తుఫాను మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని, ముఖ్యమంత్రి ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదని విమర్శించారు. నష్టం ఎక్కువ జరిగిందని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాలని అనుకున్నారేమోనని, అంచనాలకు జరిగిన నష్టానికి పొంతన లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 8 వందల కోట్లు మాత్రమే వ్యవసాయానికి నష్టం అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.
Andhra Pradesh
Cyclone Motha
YS Sharmila
AP Congress
farmers loss
crop damage
Krishna district
Pedana
వ్యవసాయ సంక్షోభం
ప్రభుత్వ అంచనాలు
పరిహారం
తుఫాన్ ప్రభావం
Scroll for the next article