Farmers5th Oct 12:35 PMSunil Byrisetty1 min read

పొలాల్లో ఫ్లెక్సీలు.. సీమ రైతుల నిరసన

రాయలసీమ రైతులు వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఎండిపోయిన పొలాల్లో ఫ్లెక్సీలను పెట్టి తమ ఆక్రోశాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ ఫ్లెక్సీల ఫోటోలు సోషల్ మీడియాలో కూడా దర్శనమి

పొలాల్లో ఫ్లెక్సీలు.. సీమ రైతుల నిరసన
రాయలసీమ రైతులు వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఎండిపోయిన పొలాల్లో ఫ్లెక్సీలను పెట్టి తమ ఆక్రోశాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ ఫ్లెక్సీల ఫోటోలు సోషల్ మీడియాలో కూడా దర్శనమివ్వడంతో దీనిపై చర్చ నడుస్తుంది. పెట్టుబడులు పెట్టి, రాత్రి పగలు కష్టపడి పండించిన పంటలు కళ్లెదుటే పోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "పంటలు ఎండిపోతున్నాయి.. రూ. లక్ష కోట్లు ఎక్కడ?" అంటూ ఆ ఫ్లెక్సీలపై రాసిన నినాదాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే రాయలసీమలో ఏ ప్రాంతంలో అనేది తెలియాల్సి ఉంది.
Scroll for the next article