News27th Oct 02:39 PMSunil Byrisetty1 min read

ఆర్ణబ్ నేపధ్యంలో రైతులు అప్రమత్తం కావాలి

ఆర్ణబ్ తుఫాను హెచ్చరికల నేపధ్యంలో రైతులు అప్రమత్తం కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఈ ఏడాది ఎల్నినో వర్షాభావ పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో 87 శాతం విస్తీర్ణంలో

ఆర్ణబ్ నేపధ్యంలో రైతులు అప్రమత్తం కావాలి
ఆర్ణబ్ తుఫాను హెచ్చరికల నేపధ్యంలో రైతులు అప్రమత్తం కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఈ ఏడాది ఎల్నినో వర్షాభావ పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో 87 శాతం విస్తీర్ణంలో సాగు చేసిన పంటలను జాగ్రత్తగా కాపాడుకోవటానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సింహభాగం పంట చిరుపొట్ట దశ, ఈనిక దశలలో ఉన్నందున, అధిక వర్షపాతం నమోదు, వర్షాలు అనంతరం ఎగువ ప్రాంతంల నుండి వరద వచ్చి పొలాల్లో నిలబడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా పొలాల్లోని నీటిని బయటకు పంపించివేయాలని సూచించారు. మురుగు నీరు వెంటనే బయటకు పోయేలా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పొలాల దగ్గరలోని డ్రైనేజీ కాలువలలో అడ్డంకులను ముందస్తుగానే తొలగించుకోవటంతో పంట ముంపునకు గురికాకుండా తగ్గించుకోవచ్చన్నారు. వర్షాలకు పొలాల్లో చేరిన నీటిని తొలగించిన అనంతరం పంటను పరిశీలించి వ్యవసాయ అధికారుల సూచన మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ పరికరాలు, విద్యుత్ మోటార్లు నీటిలో తడవకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలన్నారు. తాత్కాలికంగా పొలాల్లో ఎరువులు, పురుగు మందుల పిచికారీ వాయిదా వేసుకోవాలన్నారు. రైతులు పంట నష్టం, పంటల భీమా సంబంధిత సమాచారం కోసం ఫొటోలు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలన్నారు. తుఫాను సమయంలో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు పొలాల్లో వుండరాదని సూచించారు. పంటను రక్షించుకోవటమే కాకుండా రైతుల ప్రాణ భద్రత ముఖ్యం కావున ఎట్టి పరిస్థితుల్లోనూ తుఫాను సమయంలో పొలాల్లోకి వెళ్ళరాదన్నారు.
Scroll for the next article