Crime6th Mar 12:03 PMSunil Byrisetty1 min read
అనంతపురం జిల్లాలో పరువు హత్య
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులుకు నలుగురు కూతుళ్ళు కాగా.. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న చిన్న కూతురు భారతి.. హైదారాబాద్ లో డిగ్రీ చేస్తోన్న యువకుడిని ప్రేమించింది.
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులుకు నలుగురు కూతుళ్ళు కాగా..
డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న చిన్న కూతురు భారతి.. హైదారాబాద్ లో డిగ్రీ చేస్తోన్న యువకుడిని ప్రేమించింది.
అతడు వేరే కులానికి చెందిన వాడని తెలుసుకున్న రామాంజనేయులు.. మరిచిపోవాలని కూతురును మందలించాడు.
తండ్రి మాటను కూతురు పట్టించుకోలేదు. ఈ నెల ఒకటో తేదీన తన కూతురుని బండిపై గుంతకల్లు మండలం కసాపురానికి తీసుకెళ్ళిన తండ్రి.. మరొకసారి మందలించాడు. అయినా కూతురు వినలేదని బలవంతంగా చెట్టుకి ఉరి వేశాడు.
చనిపోయాక తన బండి నుంచి పెట్రోల్ తీసి కూతురుపై పోసి నిప్పంటించి తగులబెట్టాడు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.