News23rd Sep 11:39 AMSunil Byrisetty1 min read

వైసీపీ హయాంలోనే రూ. 4 వేల కోట్ల బకాయిలు!

వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై మం

వైసీపీ హయాంలోనే రూ. 4 వేల కోట్ల బకాయిలు!
వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా.. ఛైర్మన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బీఏసీలో ఈ అంశంపై చర్చకు ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ. 4వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోవిడ్ సమయంలో రూ.644 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్టీఎఫ్ కింద 3వేల కోట్లు పెండింగ్ లో పెట్టారు. ఎంటీఎఫ్ కింద 895 కోట్లు పెండింగ్ లో పెట్టారు. 2024-25 ఏడాదికి వచ్చేసరికి కూటమి ప్రభుత్వంలో రూ.1,200 కోట్లు విడుదల చేశాం. పెండింగ్ లో ఉన్న రూ.1,400 కోట్లు వచ్చే మూడు నెలల్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Andhra Pradesh Politics
YSRCP
TDP
Nara Lokesh
Fee Reimbursement
Pending Dues
Student Welfare
Higher Education
మండలి సమావేశాలు
బీఏసీ
కోవిడ్ నిధులు
2024-25 బడ్జెట్
Scroll for the next article