News18th Sep 05:47 PMSunil Byrisetty1 min read

ఉచిత బస్సుతో ఊపిరి ఆగేలా ఉంది

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని కండక్టర్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన కుసుమకుమారి అని తెలిసింది.ఏపీలో ఉచిత బస్సు పథకంతో బస్సులలో రద్దీ పె

ఉచిత బస్సుతో ఊపిరి ఆగేలా ఉంది
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని కండక్టర్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన కుసుమకుమారి అని తెలిసింది.ఏపీలో ఉచిత బస్సు పథకంతో బస్సులలో రద్దీ పెరిగిపోయింది. దీంతో ప్రయాణికులు తమ మాట వినడం లేదంటూ ఓ మహిళా కండక్టర్ ఆవేదన నెట్టింట వైరల్ అవుతోంది.ఆర్టీసీ బస్సులలో పరిమితికి మించి ఎక్కుతున్నారని ఆ వీడియోలో కండక్టర్ వాపోయారు.150 నుంచి 170 మంది ప్రయాణికులు బస్సులో ఎక్కుతున్నారని.. చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కిక్కిరిసిన జనాలతో బస్సులోనే మా ఊపిరి ఆగిపోయేలాఉంది సర్ అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. కొట్టుకోవడం, కండక్టర్‌ మీద తిరగబడటం, గొర్రెలా అరుస్తున్నా పైకి ఎక్కకపోవడం చేస్తున్నారని.. మీరిచ్చే జీతాల కన్నా ఎక్కువ కష్టపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh
APSRTC
Bus Conductor
Kusumakumari
Viral Video
Free Bus Scheme
Overcrowded Bus
Public Transport
Women Conductor
Passenger Issues
మహిళా కండక్టర్
ప్రయాణికుల సమస్యలు
Scroll for the next article