Crime27th Mar 12:27 PMSunil Byrisetty1 min read

గంజాయి స్మగ్లింగ్.. లేడీ డాన్‌ను పట్టించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్!

తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలోనూ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న లేడీ డాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గంజాయి స్మగ్లింగ్ కేసులో లేడీ డాన్ అరెస్టైంది. అంతర్రాష్ట్ర పోలీసులను కొన్న

గంజాయి స్మగ్లింగ్.. లేడీ డాన్‌ను పట్టించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్!
తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలోనూ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న లేడీ డాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గంజాయి స్మగ్లింగ్ కేసులో లేడీ డాన్ అరెస్టైంది. అంతర్రాష్ట్ర పోలీసులను కొన్నేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న లేడీ డాన్ సంగీతా సోషల్ మీడియా వల్ల పట్టుబడింది. ఒడిశాలో సంగీతా సాహును పోలీసులు అరెస్టు చేశారు. సంగీతా సాహుపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ధూల్ పేట్ లో 4 కేసులు ఉన్నాయి. సంగీతా సాహు తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో హీరోయిన్‌లా రీల్స్ చేసి పోస్ట్ చేస్తుంటుంది. అనేక రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారస్తులతో పరిచయాలు కూడా పెట్టుకుంది. నాలుగేళ్ల క్రితం గంజాయి హోల్ సేల్ వ్యాపారంలోకి దిగిన సంగీతా సాహు అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ డాన్‌గా ఎదిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రీల్స్ ఆధారంగా పోలీసులు సంగీతను అరెస్ట్ చేశారు.
Female Ganja Don
Odisha
సంగీతా సాహును
Scroll for the next article