News13th Jan 11:19 AMSunil Byrisetty1 min read

హైవేపై కొనసాగుతున్న పండుగ రద్దీ

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏపీకి తరలి వెళ్తున్న వాహనాలతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర ట్రాఫిక్ స్

హైవేపై కొనసాగుతున్న పండుగ రద్దీ
హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏపీకి తరలి వెళ్తున్న వాహనాలతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. టోల్‌ప్లాజా నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఏపీకి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జనం క్యూ కట్టడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్‌లో స్థాయిలో ప్రజలు తరలివెళ్లారు. నాలుగు రోజులుగా ఏపీకి భారీగా వాహనాలు తరలివెళ్తున్నాయి.
Andhra Pradesh travel
festival traffic
Hyderabad Vijayawada highway
national highway traffic jam
Sankranti rush
Pantangi toll plaza
Yadadri district
పండుగ ప్రయాణాలు
వాహనాల రద్దీ
జాతీయ రహదారి
రికార్డు స్థాయి
Scroll for the next article