Jobs14th Oct 12:40 PMSunil Byrisetty1 min read

నిరుద్యోగులకు పండుగ వార్త

పండుగ వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. వార్షిక జాబ్ క్యాలెం

నిరుద్యోగులకు పండుగ వార్త
పండుగ వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. వార్షిక జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సంబంధించి ప్రాథమిక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ తాజా ఆదేశాల ప్రకారం ఈ విడతలో మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ అలాగే మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ,సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులతో పాటు, స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలు , వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని ప్రిన్సిపాల్స్, పీజీటీ , టీజీటీ , పీడీ, పీఈటీ పోస్టులు కూడా ఈ భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవడానికి త్వరలోనే పూర్తి స్థాయి షెడ్యూల్ అందుబాటులోకి రానుంది.
Scroll for the next article