News10th Jan 11:20 AMSunil Byrisetty1 min read
పండుగకు పట్నంవాసుల పల్లె బాట
సంక్రాంతి పండుగ వేళ జనం పట్నం నుంచి పల్లె బాట పడుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాకు తరలి వస్తున్నారు. దీంతో చౌటుప్పల్ మండల
సంక్రాంతి పండుగ వేళ జనం పట్నం నుంచి పల్లె బాట పడుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాకు తరలి వస్తున్నారు. దీంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద సేమ్ సీన్ కనిపిస్తోంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపైనా భారీగా వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్లను దాటేందుకు రెండు గంటల సమయంపైగానే పడుతోంది. టోల్, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ని క్లియర్ చేయలేకపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.