Entertainment1st Jan 01:18 PMSunil Byrisetty1 min read

పవన్ ఫ్యాన్స్ కి పండగే.. కొత్త సినిమా ఫిక్స్

ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులకు పండుగలాంటి వార్త వచ్చింది. ప‌వ‌ర్ స్టార్ కొత్త సినిమా క‌బురు కొత్త ఏడాది తొలి రోజే బ‌య‌ట‌కు వ‌చ్చింది. రామ్ తాళ్లూరి నిర్మాత‌గా ప‌వ‌న్ ఓ సినిమా చేస్తార‌న

పవన్ ఫ్యాన్స్ కి పండగే.. కొత్త సినిమా ఫిక్స్
ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులకు పండుగలాంటి వార్త వచ్చింది. ప‌వ‌ర్ స్టార్ కొత్త సినిమా క‌బురు కొత్త ఏడాది తొలి రోజే బ‌య‌ట‌కు వ‌చ్చింది. రామ్ తాళ్లూరి నిర్మాత‌గా ప‌వ‌న్ ఓ సినిమా చేస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. సురేంద‌ర్ రెడ్డితో ఓక‌థ ఓకే చేయించారు కూడా. కానీ ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఎట్ట‌కేల‌కు ఈ కాంబో మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ – సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో ఓ సినిమా చేయ‌బోతున్నట్టు నిర్మాత రామ్ తాళ్లూరి ప్ర‌క‌టించారు. జైత్ర రామ మూవీస్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ప‌వ‌న్‌కి క‌థ న‌చ్చడంతో.. వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ప‌వ‌న్ డేట్లు బ‌ట్టి షూటింగ్ ఉండ‌బోతోంది.
Pawan Kalyan
Power Star
Pawan Kalyan New Movie
Pawan Kalyan Surender Reddy
Surender Reddy
Ram Talluri
Jaitra Rama Movies
పవన్ ఫ్యాన్స్
పవర్ స్టార్ మూవీ అప్‌డేట్
Scroll for the next article