National14th Jun 09:28 AMSunil Byrisetty1 min read

ఇరాన్పై ఇజ్రాయిల్.. భీకర దాడి!

ఇజ్రాయిల్ ఇరాన్ పై భీకర దాడికి దిగింది. మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధాని టెహ్రాన్ తో సహా పలు ప్రాంతాలపై ఎటాక్ చేసింది. దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇస్ఫహాన్ అణు కే

ఇరాన్పై ఇజ్రాయిల్.. భీకర దాడి!
ఇజ్రాయిల్ ఇరాన్ పై భీకర దాడికి దిగింది. మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధాని టెహ్రాన్ తో సహా పలు ప్రాంతాలపై ఎటాక్ చేసింది. దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడులు చేసినట్లు తెలిపింది. ఫోర్డూ అణుకేంద్రం సమీపంలో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. అంతకుముందు రోజు, తెల్లవారుజామున ఇజ్రాయిల్ మొదటగా ఇరాన్‌పై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, ఇరాన్ ఇజ్రాయిల్‌పై డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసింది. అయితే, ఇజ్రాయిల్ ఈ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ దేశ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని కనీసం ఇద్దరు అగ్ర సైనిక అధికారులను, ఆరుగురు అగ్ర అణు శాస్త్రవేత్తలను చంపింది. 1980 ఇరాక్ వార్ తర్వాత ఇరాన్ ప్రస్తుతం అత్యంత భీకరమైన దాడుల్ని ఎదుర్కొంటోంది. ఈ దాడుల్లో 78 మంది మరణించారని, వారిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారని, 320 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ యూఎన్ ప్రతినిధి తెలిపారు. శనివారం ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్ పోర్టు తగలబడింది. మిస్సైల్ దాడిలో ఎయిర్ పోర్టు తగలబడింది. ఇది ఇరాన్ సైనిక, సివిల్ కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. ప్రస్తుతం దీనిని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది.
national news
iran
israel
iran israel conflict
iran attac israel
Massive Airstrikes
200 యుద్ధవిమానాలతో తెల్లవారుజామున దాడి
ఇరాన్‌ నడిబొడ్డునఇజ్రాయెల్‌ డ్రోన్ల స్థావరం
Scroll for the next article