News26th Aug 11:27 AMSunil Byrisetty1 min read

వరదతో ప్రాజెక్టులు నింపండి

కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్

వరదతో ప్రాజెక్టులు నింపండి
కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నింపాలని సూచించారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నిండేందుకు తగిన ప్రణాళికలు చేయాలని అన్నారు. ప్రత్యేకించి రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సచివాలయంలో జల వనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువుల్లోకి పంపాలని సూచించారు. ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్ కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించి నీరిస్తేనే ప్రజలకు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లినట్టే.. మిగతా ప్రాంతాలకూ నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు.
Andhra Pradesh Irrigation
Krishna River
Godavari River
Chandrababu Naidu
Water Management
Reservoirs Filling
Rayalaseema Water Projects
Canal System
Water Conservation
రాయలసీమ నీటి ప్రాజెక్టులు
కాలువల ద్వారా నీటి మళ్లింపు
Scroll for the next article