Jobs6th Sep 02:12 PMSunil Byrisetty1 min read
వర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 4,500 టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ క
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 4,500 టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. చట్టం 30 ప్రకారం జారీచేసిన GO.No.114 అమలుచేయాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ వినతిపై గవర్నర్ నజీర్ సానుకూలంగా స్పందించారు. అన్ని అంశాలపై పరిశీలిస్తానని పేర్కొన్నారు.