Telangana17th Nov 12:33 PMSunil Byrisetty1 min read
సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ
పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేశ్‌బాబు ఆయన్ను కలిసి వివిధ అంశాలపై
పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేశ్‌బాబు ఆయన్ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. పైరసీ వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా పైరసీ అనేది తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేదించామని, ఐబొమ్మ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశామని వివరించారు. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ అని.. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడని తెలిపారు. ఇమ్మడి రవిపై మరో 4 కేసులు ఉన్నాయన్నారు. ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.
ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేశాడని, సినిమా పైరసీ చేసి.. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశారని తెలిపారు.