Politics18th Jan 04:33 PMSunil Byrisetty1 min read

రేపు నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర

సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేయనున్నారు. అయితే ఇది రాజకీయాల కోసమో, కొత్త సినిమా కోసమో కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జైలు పాలైన సందర్భంగా బండ్ల మొక్కుకున

రేపు నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర
సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేయనున్నారు. అయితే ఇది రాజకీయాల కోసమో, కొత్త సినిమా కోసమో కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జైలు పాలైన సందర్భంగా బండ్ల మొక్కుకున్న పాదయాత్ర మొక్కు. చంద్రబాబు మీద వేసిన అభాండాలు తొలిగిపోవాలని, ఆయన చెరసాల నుంచి బయటికి రావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడప మీద నిలబడి మొక్కుకున్న మొక్కు “నా గడప నించి నీ కొండ దాకా పాదయాత్ర" చేసి వస్తా అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్నగర్లోని ఆయన తన ఇంటి గడప ముందు కొబ్బరి కాయ కొట్టి పాదయాత్ర మొదలెట్టి ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకి చేరి ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవడం సంకల్పం అని తెలిపారు.
Andhra Pradesh
Bandla Ganesh
Sankalpa Yatra
Padayatra
Film Producer
Chandrababu Naidu
TDP Chief
Supreme Court
Tirumala
సుప్రీం కోర్టు
తిరుమల
శ్రీనివాసుడు
షాద్నగర్
భక్తి ప్రయాణం
Scroll for the next article