Entertainment4th Nov 06:02 PMSunil Byrisetty1 min read

సినిమా తప్పేం లేదు.. అర్థం చేసుకోవాలి

రాప్తాడులో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటన నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమ

సినిమా తప్పేం లేదు.. అర్థం చేసుకోవాలి
రాప్తాడులో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటన నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమాలో గన్‌ను స్కూల్‌లోకి తీసుకెళ్లే సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ, సినిమాల్లో చూపించే హింసాత్మక దృశ్యాలే సమాజంలో ఇలాంటి నేరాలకు కారణమవుతున్నాయంటూ ట్రోల్స్ చేశారు. ఈ విమర్శలపై తాజాగా స్పందించిన సందీప్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా దారుణమైన నేరానికి పాల్పడినప్పుడు ముందుగా బాధితుల పట్ల సానుభూతి చూపించాలని, ఇలాంటి నేరాలకు కారణమైన అసలు సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. అంతేకానీ, ప్రతి విషాద ఘటనకు సినిమాలను బాధ్యులుగా చేస్తూ ఒకరిని బలిపశువును చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒక విషాద ఘటనకు కావాల్సింది సానుభూతి కానీ, అవకాశవాదం కాదని, ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
Scroll for the next article