News24th Dec 04:53 PMSunil Byrisetty1 min read

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను వినియోగించాలని భావిస్తున్నట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కం

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను వినియోగించాలని భావిస్తున్నట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ భేటీ బుధవారం సచివాలయంలో జరిగింది. ప్యాలెస్ వినియోగంపై వచ్చిన పలు ప్రతిపాదనలను చర్చించామని, తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ముందుకొచ్చినట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రుషికొండ భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని తెలిపారు. ప్యాలెస్ లపై అదనంగా భవంతులు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చినట్లు మంత్రులు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మరోసారి ఈనెల 28న ఆన్ లైన్ జీవోఎం మీటింగ్ లో చర్చిస్తామన్నారు. ఆ సమావేశంలో వచ్చే తుది ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నామన్నారు. అంతిమంగా హాస్పిటాలిటీ వైపు మొగ్గు చూపుతూ వయబుల్ మోడ్ లో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సబ్ కమిటీ పేర్కొంది.
Andhra Pradesh Government
Rushikonda Palace
Visakhapatnam
Hospitality Development
Public-Private Projects
Tourism Infrastructure
పర్యాటక మౌలిక సదుపాయాలు
రాష్ట్ర కేబినెట్ ఆమోదం
హోటల్ & రిసార్ట్ ప్రణాళికలు
Scroll for the next article