Crime10th Mar 09:29 AMSunil Byrisetty1 min read

పరువు హత్య కేసులో తుది తీర్పు నేడే!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అమృత- ప్రణయ్ కేసు గుర్తుండే ఉంటుంది. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో తుది తీర్పు నేడు వెలువడనుంది. పెద్దలను ఎదిరించి అమృత, ప్రణయ్

పరువు హత్య కేసులో తుది తీర్పు నేడే!
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అమృత- ప్రణయ్ కేసు గుర్తుండే ఉంటుంది. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో తుది తీర్పు నేడు వెలువడనుంది. పెద్దలను ఎదిరించి అమృత, ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకోవడంతో కిరాయి ముఠాతో ప్రణయ్‌ను హత్య చేయించారు. ఇందుకు ప్లాన్ చేసిన అమృత తండ్రి మారుతీరావు తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తీవ్ర సంచలనం రేపింది. నాడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. తుది తీర్పు మార్చి 10న విడుదల చేస్తామని న్యాయస్థానం నాడు ప్రకటించింది. ఈ కేసులో న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Pranay
Amrutha
love marriage
Miriyalaguda
ప్రణయ్
అమృత
ప్రేమ వివాహం
మిరియాలగూడ
Scroll for the next article