News29th Dec 05:10 PMSunil Byrisetty1 min read
ఉత్తమ ఆలోచనలకు రూ. 1 లక్ష నుంచి రూ.1 కోటి వరకు ఆర్థిక సాయం
జల సమస్యలకు పరిష్కారాలు కనుగొని నూతన సాంకేతికతతో నీటి నిర్వహణను మెరుగుపర్చడమే జల శక్తి హాక్ థాన్ - 2025 ముఖ్య ఉద్దేశ్యమని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర
జల సమస్యలకు పరిష్కారాలు కనుగొని నూతన సాంకేతికతతో నీటి నిర్వహణను మెరుగుపర్చడమే జల శక్తి హాక్ థాన్ - 2025 ముఖ్య ఉద్దేశ్యమని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్ఎస్ రావు తెలిపారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్, రెజువనేషన్ ఆధ్వర్యంలో జల్ శక్తి హ్యాక్ థాన్ – 2025 పై ప్రాంతీయ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం కానూరు వీఆర్ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం లో నిర్వచించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్ఎస్ రావు హాజరై మాట్లాడుతూ.. మీరు నివసిస్తున్న ప్రాంతం లేదా మీ గ్రామంలో నీటి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి సాధ్యమైన పరిష్కారాన్ని 10 లైన్లలో జల శక్తి మంత్రిత్వ శాఖ పోర్టల్ bharatwin.mowr.gov.in లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. నీరు అనేది కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమైన అంశం కాదని, సామాన్య రైతు నుంచి మేధావుల వరకు ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. కోవిడ్ అనంతరం నీటి నాణ్యతలో వచ్చిన మార్పులు, మందుల వ్యర్థాలు మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కలుగుతున్న కాలుష్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజ అవసరాలతో నేరుగా సంబంధం ఉన్న సివిల్ ఇంజనీర్లు సామాన్య ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో ముందుండాలన్నారు. ఎంపికైన ఉత్తమ ఆలోచనలకు జల శక్తి మంత్రిత్వ శాఖ రూ. 1 లక్ష నుండి రూ. 1 కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.