News29th Mar 02:48 PMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం
తెలంగాణలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉగాది రోజున హుజూర్‌నగర్‌లో సీఎం
తెలంగాణలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది.
ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఉగాది రోజున హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
తర్వాత దశలవారీగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించనున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని 85 శాతం మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.
కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నామని, అవన్నీ క్యూఆర్ కోడ్‌తో ఉంటాయని వివరించారు.
డ్రా విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బీపీఎల్ కుటుంబాలకు ఎరుపు రంగు కార్డులు, ఏపీఎల్ కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు ఇస్తామని వెల్లడించారు.
'ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తుండడంతో చాలామంది వినియోగించడం లేదన్నారు.
దీంతో డీలర్ల నుంచి బ్లాక్‌లో అక్కడక్కడా అమ్ముకుంటున్నారని, సన్న బియ్యం పంపిణీ చేస్తే అందరూ వాటినే వాడుకుంటారని మంత్రి వివరించారు.