Crime27th Oct 11:47 AMSunil Byrisetty1 min read
మలబార్ గోల్డ్ పై ఎఫ్ఐఆర్!
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌లో నిలువు దోపిడీ వ్యవహారం బయటపడింది. షోరూమ్ కి వెళ్లిన ఒక కస్టమర్ తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్ర
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌లో నిలువు దోపిడీ వ్యవహారం బయటపడింది. షోరూమ్ కి వెళ్లిన ఒక కస్టమర్ తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్రాస్‌లెట్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని అడిగాడు. షోరూమ్ సిబ్బంది దాన్ని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్‌లో పరీక్షించారు. ఒక్కసారి కాదు... రెండుసార్లు... ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. ప్రతీసారీ రీడింగ్ ఒకేలా వచ్చింది: కేవలం 20 క్యారెట్ మాత్రమే!
పైగా ఆ బ్రాస్‌లెట్‌పై అసలు హాల్‌మార్కే లేదని బుకాయించారు.వెంటనే ఆ కస్టమర్ ఆ బ్రాస్‌లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్‌కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నంబర్‌ని నిర్ధారించి, వాళ్ల ముందే మళ్లీ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు. అదే మెషీన్... అదే బ్రాస్‌లెట్... అదే రూమ్! ఈసారి అక్కడి ఉద్యోగి మెషీన్‌లో ఏదో 'సెట్టింగ్' మార్చాడు. అంతే!
కట్ చేస్తే రీడింగ్ ఒక్కసారిగా 916 – ప్యూర్ 22 క్యారెట్‌గా మారిపోయింది! ఆ లోకల్ జ్యువెలర్ ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే సరఫా అసోసియేషన్ రంగంలోకి దిగింది. పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్‌లపై FIR నమోదు చేశారు.