News4th Apr 10:06 AMSunil Byrisetty1 min read
సచివాలయంలో మంటలు
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందిక
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది.
రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఎస్పీఎఫ్ సిబ్బంది సైతం రంగంలోకి దిగి మంటలు పెరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఫైర్ సేఫ్టీ సిబ్బంది
మంటలను అదుపులోకి తెచ్చారు.
తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో ప్రమాదం తప్పింది.
ప్రమాదానికి గల కారణాలపై భద్రతాధికారులు ఆరా తీస్తున్నారు.
హోంమంత్రి అనిత ఇప్పటికే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.