News15th Jul 10:55 AMSunil Byrisetty1 min read
పరవాడ ఫార్మాలో మరో అగ్నిప్రమాదం!
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా పరిశ్రమల్లో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సాయి చందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా పరిశ్రమల్లో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సాయి చందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంపై ఆంాదోళన వ్యక్తమవుతోంది.