News4th Jan 04:30 PMSunil Byrisetty1 min read
భోగాపురంలో తొలి విమానం ల్యాండ్!
భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఇది ఎయిర్‌పోర్ట్‌కు కీలక మైలురాయిగా మారింది. ఏపీ విమానయాన రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. వ్యాలిడేషన్ ప్లైట్ ను విజయవంతంగా పూర్తి చ
భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఇది ఎయిర్‌పోర్ట్‌కు కీలక మైలురాయిగా మారింది. ఏపీ విమానయాన రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. వ్యాలిడేషన్ ప్లైట్ ను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ బలోపేతం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ ఊతమని చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు మద్దతు అందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ప్రజల సేవలకు విమానాశ్రయం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. జూన్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని, విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపథంలో ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.