News31st Dec 10:48 AMSunil Byrisetty1 min read

భోగాపురానికి 4న తొలి విమానం!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో, అధికారులు కీలకమైన ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనవరి

భోగాపురానికి 4న తొలి విమానం!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో, అధికారులు కీలకమైన ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనవరి 4న భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి కమర్షియల్ ఫ్లైట్ దిగనుంది. ఫైనల్ టెస్ట్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ (DGCA) ఉన్నతాధికారులు అదే విమానంలో ఇక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
Andhra Pradesh
Bhogapuram Airport
International Airport
First Flight
Commercial Flight
Trial Run
Air India
Aviation
పౌర విమానయాన శాఖ
విమానాశ్రయం ప్రారంభం
డీజీసీఏ
Scroll for the next article