Spiritual24th Jul 10:45 AMSunil Byrisetty1 min read

తొలి ఏకాదశి.. విశిష్టత ఏంటంటే..

ఉపవాసాలలో ఏకాదశి శ్రేష్ఠమైనది. ఏకాదశులలో తొలి ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో

తొలి ఏకాదశి.. విశిష్టత ఏంటంటే..
ఉపవాసాలలో ఏకాదశి శ్రేష్ఠమైనది. ఏకాదశులలో తొలి ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి, అనగా తొలి ఏకాదశి, అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణించబడుతుంది. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి "తొలి ఏకాదశి" అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు. ఈ ఏకాదశిని ఇంకా .. దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.
Indian Culture
Tholi Ekadashi
Devshayani Ekadashi
Hari Shayani Ekadashi
Padma Ekadashi
Ashadha Shukla Ekadashi
Lord Vishnu
చాతుర్మాస్యం
ఏకాదశి వ్రతం
సనాతన ధర్మం
హిందూ పండుగలు
Scroll for the next article