Technology26th Sep 11:52 AMSunil Byrisetty1 min read
అగ్ని ప్రైమ్ క్షిపణి.. రైలు నుంచి నింగిలోకి అగ్ని
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. సంచార లాంచర్ రైల్వే వ్యవస్థ ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి అని, రక్షణ రంగంలో మైలురాయిఅని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నార
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. సంచార లాంచర్ రైల్వే వ్యవస్థ ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి అని, రక్షణ రంగంలో మైలురాయిఅని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా 'అగ్ని ప్రైమ్' క్షిపణిని.. రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎక్కడి నుంచి చేశారనేది బహిర్గతం చేయలేదు. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. రైలుపై ఈ తరహాలో క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని రక్షణమంత్రి రాజ్నాథ్ ఒకరోజు తర్వాత 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 'డీఆర్డీవో, వ్యూహాత్మక దళాల విభాగం (ఎస్ఎఫ్సీ), సైన్యానికి అభినందనలు. ఈ విజయం భారత రక్షణ రంగంలో ఓ మైలురాయి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైల్వే వ్యవస్థ ద్వారా ఎక్కడికైనా క్షిపణిని సులభంగా తరలించే వీలుంది.