News27th Jun 05:59 PMSunil Byrisetty1 min read
సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత
“సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి చర్యలకు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి,
“సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి చర్యలకు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మన్యం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి సమన్వయంతో జిల్లాను అభివృద్దిపధంలో తీసుకెళ్దామని అన్నారు. అభివృద్ధిలో జిల్లా ద్వితీయ స్థానంలో ఉండడం సంతోషంగా ఉందని అన్నారు. పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగతుందని అన్నారు.