News22nd Jul 05:31 PMSunil Byrisetty1 min read
సుపరిపాలన లో తొలిఅడుగు
గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన టిట్కో ఇల్లు త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష
గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన టిట్కో ఇల్లు త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఉయ్యూరు 18వ వార్డులో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గూర్చి వివరించారు.
గత జగన్మోహన్ రెడ్డి అసమర్థత పాలన వల్ల ఆగిపోయిన టిట్కో ఇల్లు త్వరలోనే పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న రహదారులను బాగు చేయడం జరిగిందని అన్నారు.