News25th Nov 05:31 PMSunil Byrisetty1 min read

తొలిసారి గిరిజన చిన్నారుల సాంస్కృతిక ఉత్సవాలు

ఏలకవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సన్నద్ధమయింది. గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెల

తొలిసారి గిరిజన చిన్నారుల సాంస్కృతిక ఉత్సవాలు
ఏలకవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సన్నద్ధమయింది. గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం డిసెంబర్ 3,4,5 తేదీల్లో నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని కేఎల్ యూనివర్శిటీలో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఆమోదించడం జరిగింది. ఉద్భవ్ -2025 పేరుతో నిర్వహించనున్న ఈ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలలో ప్రతిభ చాటేందుకు 22 రాష్ట్రాలకు చెందిన 405 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 1644 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. విద్యార్థులతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు, కంటింజెంట్ మేనేజర్స్ మరో 278 మంది హాజరవుతున్నారు. దేశంలోని సాంస్కృతిక, కళా వైవిద్యం మరియు గిరిజనుల జీవిత ముఖచిత్రాలను ప్రతిబింబించే సంగీతం, సాహిత్యం, నృత్యం, థియేటర్ ఆర్ట్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేయనుంది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదాభార్గవి, గురుకులం కార్యదర్శి ఎం. గౌతమి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉద్భవ్‌-2025 పోస్టర్, లోగోను ఆవిష్కరించారు.
Tribal cultural festival
Eklavya Model Residential Schools
Udbhav 2025
Andhra Pradesh government
tribal welfare department
KL University Amaravati
గిరిజన సంస్కృతి
కళారూపాలు
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
గిరిజన విద్య
రాష్ట్ర స్థాయి ఉత్సవాలు
Scroll for the next article