News4th Jan 04:19 PMSunil Byrisetty1 min read
దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపు
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ అన్నారు. అందులో భాగంగానే దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత ముఖ్య
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ అన్నారు. అందులో భాగంగానే దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను సైతం అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని మనం చూసాం.
గత పాలనలో పేదలకు భారమైన వాటిలో విద్యుత్ వ్యవస్థ కూడా ఒకటని చెప్పాలి. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన రంగం విద్యుత్ రంగం. అలాంటి రంగాన్ని గత ఐదేళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, దాదాపు రూ32వేల కోట్ల భారం ప్రజలపై మోపడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2వేల కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించిందని వివరించారు.