News27th Aug 12:04 PMSunil Byrisetty1 min read

ఏపీలో మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరం

వైఎస్సార్సీపీ తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులు వేటకు వెళితే తిరిగి ప్రాణాలతో వస్తారో రారో అన్న పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. ప్రతి రెండు మూడ

ఏపీలో మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరం
వైఎస్సార్సీపీ తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులు వేటకు వెళితే తిరిగి ప్రాణాలతో వస్తారో రారో అన్న పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. ప్రతి రెండు మూడు నెలలకు మత్స్యకారుల బోట్లకు ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి బయలుదేరిన శ్రీ ముత్యాలమ్మ బోటు 24 రోజుల పాటు సముద్రంలో చిక్కుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, కోస్ట్‌గార్డ్, భారత రాయబార కార్యాలయాలపై మేం నిరంతరం ఒత్తిడి తేవడం వల్ల పశ్చిమ బెంగాల్ మత్స్యకారుల బోటుకు చిక్కిన వీరంతా ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. 900 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఏపీలో మత్స్యకారులకు ప్రభుత్వం ఏ భరోసా కల్పిస్తోందని ప్రశ్నించారు. ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్ ఎందుకు నిర్వహించడం లేదని, మత్స్యకారుల బోట్లకు శాటిలైట్ ఫోన్లు ఎందుకు అందివ్వకూడదని నిలదీశారు. మత్స్యకారులకు జీపీఎస్ ట్రాకర్లు, లైఫ్ జాకెట్లు, అవసరమైన సేఫ్టీ ఎక్విప్‌మెంట్ అందించాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh Fishermen
Maddila Gurumoorthy
YSRCP
Tirupati MP
Fishermen Safety
Fishing Boats
Maritime Safety
Coast Guard
GPS Trackers
జీపీఎస్ ట్రాకర్లు
శాటిలైట్ ఫోన్లు
లైఫ్ జాకెట్లు
భద్రతా పరికరాలు
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం
కోనసీమ
Scroll for the next article