News26th Sep 11:56 AMSunil Byrisetty1 min read
వేట నిలిచినా.. మత్స్యకార కుటుంబాలకు భరోసా
తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం మంజూరు చేసినట్లు వెల్లడించారు. సముద్రంలో వేటే జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ప్రతికూల వాతావరణంతో ఉపాధికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆయా కుటుంబాల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఆపద సమయంలో బాధితులకు సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. బియ్యం పంపిణీకి సంబంధించి జిల్లాల యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో అర్హులైన మత్స్యకార కుటుంబాలన్నింటికీ ఈ సహాయం అందుతుందని స్పష్టం చేశారు. వేట నిలిచిపోయిన వేళ వారి కుటుంబాల ఆహార అవసరాలకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.