News5th Oct 04:07 PMSunil Byrisetty1 min read

ఏపి హై కోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులు జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్,జస్టిస

ఏపి హై కోర్టుకు  శాశ్వత న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులు జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్,జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ,జస్టిస్ డా. యడవల్లి లక్ష్మణ రావు బాధ్యతలు స్వీకరించారు. ఏపి హై కోర్టు మొదటి కోర్టు హాల్లో పుల్ బెంచ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్),జస్టిస్ చల్లా గుణ రంజన్,జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ,జస్టిస్ డా. యడవల్లి లక్ష్మణ రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హై కోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేయగా ఈ ఐదుగురు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరిగింది. ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ఇతర గౌరవనీయ న్యాయ మూర్తులందరూ ఈ వేడుకకు హాజరై తమ సహచర న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయ వాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Scroll for the next article