News14th Apr 09:24 AMSunil Byrisetty1 min read

ఆ ఆలయాలకు రోప్ వే.. పర్యాటక శాఖ అడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఐదు చోట్ రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. చిత్తూరు జిల్లాలోని బో

ఆ ఆలయాలకు రోప్ వే.. పర్యాటక శాఖ అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఐదు చోట్ రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయం, నంద్యాల జిల్లా అహోబిలం దేవస్థానం, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, విజయవాడలోని భవానీ ద్వీపం, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉన్నాయి. బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద దిగువ ఆలయం నుంచి హిల్ టాప్ వరకూ 0.68 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. అహోబిలం దేవస్థానం వద్ద.. ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహస్వామి ఆలయం వరకూ 1.28 కిలోమీటర్లు.. కోటప్పకొండ వద్ద కొండ దిగువ నుంచి ఎగువకు, పాత దేవాలయం వరకూ 1.23 కిలోమీటర్ల మేరకు రోప్‌వే నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే విజయవాడలో కృష్ణా నది మీదుగా బెర్మ్ పార్క్ నుంచి భవానీ ఐలాండ్ వరకూ 0.85 కిలోమీటర్ల మేరకు రోప్‌వే నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఆలయం ముందు నుంచి శిఖరాగ్రం వరకూ 0.25 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి.
Andhra Pradesh
Five Ropeway Projects
చిత్తూరు జిల్లా
నంద్యాల జిల్లా
పల్నాడు జిల్లా
విజయవాడ
తూర్పు గోదావరి జిల్లా
Scroll for the next article