News18th Dec 12:28 PMSunil Byrisetty1 min read
ఐదు జిల్లాలకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లు
జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ సారించింది. ఐదు జిల్లాలకు సీనియన్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం జిల్లా ఇన్‌చార్జిలుగా నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలో ప్ర
జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ సారించింది. ఐదు జిల్లాలకు సీనియన్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం జిల్లా ఇన్‌చార్జిలుగా నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు పాటించాల్సిన విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్ డిపార్ట్‌మెంట్స్ కో - ఆర్డినేషన్ కోసం పని చేయాల్సి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాకు జి.వీరపాండియన్, కాకినాడ జిల్లాకు ప్రసన్న వెంకటేశ్, బాపట్ల జిల్లాకు మల్లికార్జున్, శ్రీసత్యసాయి జిల్లాకు గంధం చంద్రుడు, నంద్యాల జిల్లాకు సి.హెచ్.శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.