Education21st Aug 05:18 PMSunil Byrisetty1 min read
ఆర్‌టీఐహెచ్‌లో ఐదు రోజుల శిక్షణా శిబిరం ముగింపు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్), విజయవాడ–ఎనికేపాడు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 21 వరకు నిర్వహించిన ఐదు రోజుల పారిశ్రామికవేత్తల శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసింది. ప్రపంచ పార
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్), విజయవాడ–ఎనికేపాడు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 21 వరకు నిర్వహించిన ఐదు రోజుల పారిశ్రామికవేత్తల శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ శిక్షణా శిబిరంలో పీబీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులతో పాటు సుమారు 100మంది విద్యార్థులు పాల్గొన్నారు. పారిశ్రామిక ఆలోచనా విధానం, సమస్యలను గుర్తించడం, వినూత్న పరిష్కారాలను రూపొందించడం, వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై వారికి అవగాహన, శిక్షణ అందించారు. కార్యక్రమంలో భాగంగా 21 వినూత్న వ్యాపార ఆలోచనలను విద్యార్థులు నిపుణుల ముందు ప్రదర్శించారు. పౌర సేవలు, ప్రజా రవాణా, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించిన ఆలోచనలను విద్యార్థులు వివరించారు. నిపుణులు విద్యార్థులకు విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు.