News9th Dec 12:20 PMSunil Byrisetty1 min read
తిరుపతి- సాయినగర్ షిర్డి నూతన రైలు ప్రారంభం
తిరుపతి - సాయి నగర్ షిరిడి నూతన రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వి. సోమన్నవర్చువల్ గా ప్రారంభించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి.. తిరుపతి - సాయి నగర్ షిరిడి వీక్లీ ఎక్స్ ప్ర
తిరుపతి - సాయి నగర్ షిరిడి నూతన రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వి. సోమన్నవర్చువల్ గా ప్రారంభించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి.. తిరుపతి - సాయి నగర్ షిరిడి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు తిరుపతి - షిరిడి మధ్య కనెక్టివిటీ పెంచేందుకు రెండో వీక్లీ ఎక్స్ ప్రెస్ కు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. తిరుపతి నుంచి వయా గూడూరు - ఒంగోలు - గుంటూరు - సికింద్రాబాద్ మీదుగా షిరిడికి ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రయాణించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తో పాటు పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.