News4th Oct 10:58 AMSunil Byrisetty1 min read
విజయవాడ ఉత్సవ్ లో అదరగొట్టిన ఫ్లాష్‌మాబ్‌లు
విజయవాడ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో
విజయవాడ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిట్టినగర్ సెంటర్, భవానిపురం శివాలయం సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్, కలరా హాస్పిటల్ సెంటర్ వద్ద ప్రత్యేకంగా ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో ఒక్కసారిగా సంగీతం ప్రారంభం కావడంతో యువ కళాకారులు ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలను ప్రారంభించారు. సమన్వయంతో కూడిన నృత్య కదలికలు, ఆకట్టుకునే కొరియోగ్రఫీతో కళాకారులు చేసిన ప్రదర్శనలు స్థానికులు, ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో ప్రదర్శనలను చిత్రీకరిస్తూ ఆసక్తిగా తిలకించారు.
ఫ్లాష్మాబ్లలో విజయవాడ నగర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే అంశాలతో పాటు విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తిని చాటిచెప్పే నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతలో ఉత్సవంపై ఆసక్తిని పెంచడంతో పాటు, నగరవాసులను విజయవాడ ఉత్సవ్‌లో భాగస్వాములను చేయడం, ఉత్సవ విశేషాలను వినూత్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.