News11th Apr 04:12 PMSunil Byrisetty1 min read

వెలవెలబోతున్న విశాఖ విమానాశ్రయం

ఆంధ్రా ఆర్థిక రాజధాని అయిన విశాఖ విమానాశ్రయం వెలవెలబోతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న విశాఖపట్నానికి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతున్నాయి. కొత్త సర్వీ్‌సులు రావలసింది పో

వెలవెలబోతున్న విశాఖ విమానాశ్రయం
ఆంధ్రా ఆర్థిక రాజధాని అయిన విశాఖ విమానాశ్రయం వెలవెలబోతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న విశాఖపట్నానికి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతున్నాయి. కొత్త సర్వీ్‌సులు రావలసింది పోయి.. ఉన్నవాటినే తీసేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.. విశాఖ నుంచి గతంలో దుబాయ్‌, సింగపూర్‌, మలేసియా, శ్రీలంక, బ్యాంకాక్‌ ఐదు అంతర్జాతీయ విమాన సర్వీ్‌సులు నడిచేవి. కరోనా సమయంలో అవన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత సింగపూర్‌, మలేసియా, బ్యాంకాక్‌ సర్వీ్‌సులను పునరుద్ధరించారు. దుబాయ్‌ విమానం కూడా తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. అది నెరవేరక ముందే ప్రస్తుతం ఉన్న మూడు సర్వీసుల్లో రెండింటికి బుకింగ్స్‌ నిలిపివేశారు. మే ఒకటో తేదీ నుంచి మలేసియా, బ్యాంకాక్‌ సర్వీసులు నడపడం లేదని ఎయిర్‌ ఏషియా ప్రకటించింది. అంటే విశాఖకు ఒకే ఒక సింగపూర్‌ విమానం మిగిలింది. విశాఖపట్నం నుంచి విజయవాడకు రోజూ ఉదయం రెండు సర్వీసులు నడిపే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ నెల ఒకటో తేదీ నుంచి నిలిపివేసింది. ఇప్పుడు విశాఖ నుంచి విజయవాడకు రైళ్లు లేదా బస్సులే ఆధారం. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేసరికి విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
AP News
Visakhapatnam
Airport
Vizag Flight Crisis
విశాఖ విమానాశ్రయం
అంతర్జాతీయ
ఇండిగో ఎయిర్‌లైన్స్‌
Scroll for the next article