Technology6th Aug 03:54 PMSunil Byrisetty1 min read
ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్.. SBI కార్డుపై డిస్కౌంట్
ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తెచ్చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించడానికి పలు సైట్లు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ
ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తెచ్చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించడానికి పలు సైట్లు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ కూడా ఆగష్టు 8 నుంచి ఫ్లిప్ కార్ట్ ఫ్రీడం సేల్ తో వినియోగదారుల ముందుకి రానుంది. ఈ సేల్ కి సంబంధించిన పోస్టర్స్ ని ఫ్లిప్ కార్ట్ తమ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ లో లిస్ట్ చేయడం జరిగింది. ఈ సేల్ లో మొబైల్స్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, టీవీలు & అప్లయెన్సెస్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, ఫ్లిప్ కార్ట్ ప్రొడక్ట్స్ తో పాటు మరికొన్ని ఇతర కేటగిరిలపై భారీ డిస్కౌంట్స్ ని ఫ్లిప్ కార్ట్ అందించనుంది. వీటితో పాటు సేల్ సమయంలో వివిధ రకాల డీల్స్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. అలాగే విమాన టిక్కెట్ బుకింగ్స్ పై కూడా మంచి డిస్కౌంట్స్ ని అందిస్తుంది.ఒకవేళ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా మీరు నచ్చిన ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసినట్లయితే, అదనంగా 10 శాతం డిస్కౌంట్ ని పొందవచ్చు.