News31st Jul 03:30 PMSunil Byrisetty1 min read
లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తం
ఎగువన వర్షాలు కురిసిన నేపథ్యంలో పులిచింతల నుంచి క్రమంగా వరద నీరు పెరుగుతూ వస్తోందని.. దీంతో ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు పైకిఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నామని, ల
ఎగువన వర్షాలు కురిసిన నేపథ్యంలో పులిచింతల నుంచి క్రమంగా వరద నీరు పెరుగుతూ వస్తోందని.. దీంతో ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు పైకిఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నామని, లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించారు. చిన లంక, పెద్ద లంక, ఫెర్రీ తదితర ప్రాంతాలను సందర్శించి.. వరద ఉద్ధృతి పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజీకి ఎగువన, దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని.. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చామన్నారు. గురువారం సాయంత్రం నాటికి వరద ఉద్ధృతి మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశమున్నందున కృష్ణానది పరీవాహక ప్రాంతాల ప్రజలు వాగులు, వంకలు, కాలువలు వంటివి దాటే ప్రయత్నం చేయొద్దని.. చేపల వేటకు వెళ్లడం, పశువులు, గొర్రెలు, మేకలు వంటివాటిని వదలడం చేయొద్దని సూచించారు. నది వైపు వెళ్లకుండా పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.