Politics22nd Dec 01:01 PMSunil Byrisetty1 min read

ఎన్డీయే పార్టీలకు నిధుల వరద

రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారీగా విరాళాలు అందాయి. టీడీ

ఎన్డీయే పార్టీలకు నిధుల వరద
రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారీగా విరాళాలు అందాయి. టీడీపీకి మొత్తం రూ.83.03 కోట్ల విరాళాలు అందాయి. గతేడాది వచ్చిన రూ.100.18 కోట్లతో పోలిస్తే ఇది రూ.17.15 కోట్లు తక్కువ. ఈ నిధులలో రూ.38 కోట్లను పేదల ఆరోగ్య పథకం వంటి కార్యక్రమాలకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన పార్టీకి ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.25.33 కోట్ల విరాళాలు అందాయి. పార్టీకి ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి ఎలాంటి నిధులు అందకపోవడం గమనార్హం. జనసేనకు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు అందాయి. మరోవైపు బీజేపీకి ఏకంగా రూ. 6,088 కోట్ల విరాళాలు అందాయి. అంతకుముందు ఏడాదితో (రూ. 3,967 కోట్లు) పోలిస్తే 53 శాతం అధికం. బీజేపీకి అందిన విరాళాలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు వచ్చిన నిధుల (రూ. 522.13 కోట్లు) కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ. ప్రతిపక్ష పార్టీలకు అందిన మొత్తం విరాళాలతో పోల్చినా, బీజేపీకి అధికంగా వచ్చాయి.
Andhra Pradesh politics
NDA parties
political donations
election funding
BJP donations
TDP funds
Jana Sena Party donations
వ్యక్తిగత విరాళాలు
2024–25 ఆర్థిక సంవత్సరం
భారత రాజకీయం
Scroll for the next article