News13th Jul 04:51 PMSunil Byrisetty1 min read
కృష్ణమ్మ తీరాన కుంచెతో కోటి భావాలు!
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరిత బెరం పార్కు కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత, చిన్నారులు పాల్గొని.. తమ కళా ప్రతి
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరిత బెరం పార్కు కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత, చిన్నారులు పాల్గొని.. తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ @ 2047, పీ4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం) విధానం, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్ఛంధ్ర, సేవ్ వాటర్, రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్, హరితాంధ్ర అంశాల్లో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ చిత్ర కళా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రజలను జాగ్రతృం చేసేలా వేసిన చిత్రాలు, కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రెంట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో కనిపించిన ఉత్సాహంతో విజయవాడ గెలిచిందని.. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రతివారం హరిత బెరం పార్కులో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫొటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్.. ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని.. వీటిలో నగర ప్రజలు, పర్యాటకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్‌లో బర్డ్స్ ఫొటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు.