News22nd Sep 03:23 PMSunil Byrisetty1 min read

వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు చేపట్టాలి

పట్టణాలే అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధులు.. అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు

వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు చేపట్టాలి
పట్టణాలే అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధులు.. అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంత భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. రెండేళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్‌ ఇంజన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పట్టణాల్లో లివబిలిటీ మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేయాలని చెప్పారు. పట్టణాల్లో వీకెండ్ ఎకానమీ విపరీతంగా పెరుగుతుందని సీఎం వివరించారు. ప్రజలు తమకు వచ్చే ఆదాయంలో 61 శాతం డబ్బును వారాంతాల్లో ఖర్చు పెడుతున్నారని... అలాగే రవాణా నిమిత్తం 71 శాతం ఖర్చు పెడుతున్నారని వెల్లడించారు. దీనిపై అధికారులు.. ప్రజా ప్రతినిధులు మరింత అధ్యయనం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా వారాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Scroll for the next article