News28th Mar 05:33 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలోని రోడ్లకు పూర్వవైభవం: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

రాష్ట్రంలో మరమ్మతులు చేయడానికి వీల్లేని రహదారుల అభివృద్ధికి రూ. 600 కోట్లు కేటాయింపులు చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా ప్రధాన రహదారులకు(M

రాష్ట్రంలోని రోడ్లకు పూర్వవైభవం: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
రాష్ట్రంలో మరమ్మతులు చేయడానికి వీల్లేని రహదారుల అభివృద్ధికి రూ. 600 కోట్లు కేటాయింపులు చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా ప్రధాన రహదారులకు(MDR) సంబంధించి 64 నియోజకవర్గాల్లో 86 పనులను చేపట్టి, రూ. 200 కోట్ల వ్యయంతో 536 కి.మీ మేర రోడ్ల అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర హైవేలకు సంబంధించి 99 నియోజకవర్గాల్లో 139 పనులను చేపట్టి, రూ. 400 కోట్ల వ్యయంతో 896.41 కి.మీ మేర రోడ్ల అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 861 కోట్లతో దాదాపు 20 వేల కి.మీ రోడ్లను గుంతల రహితంగా నిర్ణీత కాల వ్యవధిలో తీర్చిదిద్దామని చెప్పారు. సీ కేటగిరీ (బాగా దారుణంగా దెబ్బ తిన్న రోడ్లు) కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ. 600 కోట్లు కేటాయింపులు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాస్కీ పథకంలో భాగంగా గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా, ప్రాధాన్యత క్రమంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 5 ఏళ్ల పాటు గుంతల రోడ్లతో ఇబ్బందులు పడ్డ రాష్ట్ర ప్రజలకు మెరుగైన రోడ్లను కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని రోడ్లకు తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Minister BC Janardhan Reddy
Roads
Andhra Pradesh
Scroll for the next article