News5th Oct 04:36 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని వన్-స్టార్ పాఠశాలలన్నీ టూ-స్టార్‌కు అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇన్‌ఫ్రాకు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో జీరో-స్టార్ పాఠశాల లన్నింటినీ వన్-స్టార్‌కు చేరేలా అభివృద్ధి చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్‌కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్‌కు చేర్చాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని సూచించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా కోరారు. పాఠశాల మౌలిక సదుపాయాల శాఖ కమిషనర్ రంజిత్ బాషా స్పందిస్తూ... ప్రస్తుతం రాష్ట్రంలో వన్-స్టార్ 1,685, టూ-స్టార్ 15,618, త్రీ-స్టార్‌లో 19,099, ఫోర్-స్టార్‌లో 7,172 పాఠశాలలు ఉన్నాయని చెప్పారు.
Scroll for the next article