News26th Jul 02:18 PMSunil Byrisetty1 min read

మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని ఫుడ్ కమిటీ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన ఏర్పాట్లలో భాగంగా భోగాపురంలో ఫుడ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కూటమి ప్రభుత్వం సభను

మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని ఫుడ్ కమిటీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన ఏర్పాట్లలో భాగంగా భోగాపురంలో ఫుడ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కూటమి ప్రభుత్వం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. 2 లక్షల మంది ప్రజలకు అందించేందుకు జరుగుతున్న భోజన ఏర్పాట్లపై మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ గుమ్మిడి సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు చర్చించారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా ఆహార ఏర్పాట్లు ఉండాలని మంత్రులు సూచించారు. భోజన ఏర్పాట్లతోపాటు, ఆహార పంపిణీ కేంద్రాల ఏర్పాటుపైనా చర్చించారు.
AP Government
Narendra Modi
Bhogapuram
BC Janardhan Reddy
Food Committee
Public Meeting
PM Modi Visit
గుమ్మిడి సంధ్యారాణి
కలిశెట్టి అప్పలనాయుడు
కూటమి ప్రభుత్వం
Scroll for the next article