Sports3rd Dec 04:42 PMSunil Byrisetty1 min read
ఆకాశంలో వేలాడే గ్రౌండ్‌లో ఫుట్బాల్ మ్యాచ్
మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికే ప్రాక్టీస్ ఉండాలి. అలాంటిది ఆకాశంలో బెలూన్ కింద వేలాడే గ్రౌండులో మ్యాచ్ ఆడి రికార్డ్ సృష్టించారు. రష్యన్ అథ్లెట్ 'సెర్గీ బోయ్ ట్సోవ్' ఈ సాహసం చేశా
మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికే ప్రాక్టీస్ ఉండాలి. అలాంటిది ఆకాశంలో బెలూన్ కింద వేలాడే గ్రౌండులో మ్యాచ్ ఆడి రికార్డ్ సృష్టించారు. రష్యన్ అథ్లెట్ 'సెర్గీ బోయ్ ట్సోవ్' ఈ సాహసం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా 5,900 అడుగుల ఎత్తులో మినీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. 'ప్రపంచంలోనే మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ ఫుట్బాల్ మ్యాచ్ను 1800 మీటర్ల ఎత్తులో నిర్వహించాం' అనే క్యాప్షన్తో ఇన్స్టాలో సెర్గీ వీడియోను షేర్ చేశారు. గాలిలో తేలుతున్న ప్రత్యేక వేదికపై పలువురు మ్యాచ్ ఆడగా.. ఓ విమానం వారి చుట్టూ తిరుగుతూ కనిపించింది. నెటిజన్లు ఈ సాహసాన్ని అభినందిస్తున్నారు.